ఆడవాళ్లు అరటిపండు తినడాన్ని చూడకూడదట!


చైనా ఆన్‌లైన్‌ లైవ్ స్టీమింగ్ చానెళ్లకు ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశం ఏమిటంటే.. ఇకపై ఆ చానెళ్లలో ప్రసారమయ్యే వీడియోల్లో మహిళలు అరటిపండు తింటుండడాన్ని చూపించకూడదట. మహిళలు అరటి పండు తింటున్న విధానంలో శృంగారానికి సంబంధించిన కోరికలు రేకెత్తించినట్లుండడమే దీనికి కారణమని వారు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై అప్‌లోడ్‌ అయ్యే అన్ని వీడియోలపై ఓ కన్నేసి ఉంచాలని లైవ్‌ స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. లైవ్‌ స్ట్రీమింగ్‌ సైట్లలోనే కాకుండా దినపత్రికల్లో కూడా ఇలాంటి చిత్రాలు ముద్రించకూడదని సూచించింది.


18ఏళ్ల వయసున్న యువతీయువకులు ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌లను వీక్షిస్తున్న వారిలో ఎక్కువగా ఉన్నందున వారిలో చెడు భావనలు కలుగకుండా చేసేందుకే ఈ ప్రకటనలు చేస్తున్నామని పేర్కొన్నారు. చాలా లైవ్‌ స్ట్రీమింగ్‌ సైట్లు పూర్తి పోర్న్‌ సైట్లుగా కాకుండా.. ఇలా సెమీ పోర్న్‌ సైట్లుగా వ్యవహరిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. వీటిని చూసేవారంతా యువతేనని తెలిపింది. ఈ చానెళ్లకు ప్రజాధరణ పెరగడంతో వాటిని అణచివేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అర్థం అవుతుంది.
Irish artist makes amazing carvings from avocado stones.


Jimena Sanchez, The Mexican Fox Sports Presenter Everyone's Calling The 'New Kim Kardashian'


Fans rally around the Love Island star for the 'unnecessary criticism'

Comments